బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో భారీగా డేటాను ఇస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్


Wed,July 11, 2018 07:03 PM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు తీపికబురు చెప్పింది. రూ.1045, రూ.1395, రూ.1895 ప్లాన్లలో ఇస్తున్న డేటా లిమిట్స్‌ను పెంచింది. త్వరలో జియో గిగాఫైబర్ రానున్న నేపథ్యంలోనే బీఎస్‌ఎన్‌ఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల తన కస్టమర్లు చేజారిపోకుండా ఉంటారని బీఎస్‌ఎన్‌ఎల్ భావిస్తున్నది.

రూ.1045 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో ఇప్పటి వరకు కస్టమర్లకు 100 జీబీ డేటా లభ్యం కాగా ఇకపై 150 జీబీ డేటా వస్తుంది. 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే రూ.1395 ప్లాన్‌లో ఇప్పటి వరకు కస్టమర్లకు 150 జీబీ డేటా లభించేది. ఇకపై 200 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్‌లో నెట్ స్పీడ్ 40 ఎంబీపీఎస్ వస్తుంది. అలాగే రూ.1895 ప్లాన్‌లో ఇప్పటి వరకు 200 జీబీ వచ్చేది. కానీ ఇకపై ఇందులో 250 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో 50 ఎంబీపీఎస్ నెట్ స్పీడ్ వస్తుంది. ఇక అన్ని ప్లాన్లలోనూ డేటా లిమిట్ అయిపోగానే నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది.

2128

More News

VIRAL NEWS

Featured Articles