రూ.1,312కే అన్‌లిమిటెడ్ కాలింగ్


Fri,January 11, 2019 03:24 PM

మార్కెట్‌లో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ , వొడాఫోన్‌ ఆఫర్లకు అనుగుణంగా మరో ప్లాన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. తాజాగా ఏడాది వాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1,312 రీఛార్జ్‌తో 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తోంది. ముంబయి, ఢిల్లీలో ఉన్న కస్టమర్లు మినహా దేశంలోని అన్ని సర్కిళ్ల వినియోగదారులు ఈ ఆఫర్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకునే వెసులుబాటును బీఎస్‌ఎన్‌ఎల్ కల్పిస్తోంది.

నూతన ప్లాన్‌లో ఉచితంగా 1,000 ఎస్సెమ్మెస్‌లు, 5జీబీ(2G / 3G) డేటాను వినియోగించుకోవచ్చు. డేటా అయిపోగానే యాడ్ ఆన్ డేటా ప్యాక్‌లతో యూజర్లు ప్రత్యేక రీఛార్జి చేసుకుంటే పరిమితి మేరకు డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన్ కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లలో ఉన్న యూజర్లు పాట‌ల‌ను రింగ్‌టోన్లుగా ఎంపిక చేసుకోవచ్చు. ప్లాన్‌ను ఎంచుకున్న తొలి 90రోజుల పాటు ఆఫర్ వర్తించనుంది.

4680

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles