కేవ‌లం రూ.1.10 కే 1 జీబీ డేటా.. బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌..!


Mon,January 21, 2019 02:44 PM

ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ భార‌త్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల‌ను ఇవాళ ప్రారంభించింది. ఇందులో భాగంగా రోజుకు 35 జీబీ డేటాను కేవ‌లం రూ.1.1 కే 1 జీబీ డేటా చొప్పున అందివ్వ‌నుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌తోపాటు త్వ‌ర‌లో రానున్న రిల‌య‌న్స్ జియో బ్రాడ్ బ్యాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫ‌ర్‌ను వినియోగ‌దారుల‌కు అందివ్వ‌నుంది. ఈ ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ గ‌రిష్ట స్పీడ్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తుంది. కాగా జియో త‌న గిగాఫైబ‌ర్ సేవ‌ల‌ను దేశవ్యాప్తంగా 1400 సిటీల‌లో ప్రారంభించ‌నున్న విష‌యం విదిత‌మే. మ‌రోవైపు ఎయిర్‌టెల్ కూడా ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌కు పోటీగా త‌న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల‌ను మార్చ‌డంతోపాటు క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ ఎత్తున ఆఫ‌ర్ల‌ను అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలిసింది.

3068

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles