న్యూ ఇయ‌ర్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ టెలికాం నెట్‌వ‌ర్క్‌ల‌లో ఇక‌పై బ్లాక్ అవుట్ డేస్ ఉండ‌వు..!


Mon,December 31, 2018 07:20 PM

బీఎస్ఎన్ఎల్‌, వొడాఫోన్‌, ఐడియా నెట్‌వ‌ర్క్‌ల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త‌. ఇక‌పై ఈ నెట్‌వ‌ర్క్‌ల‌లో ఉన్న వినియోగ‌దారుల‌కు బ్లాక్ అవుట్ డేస్ ఉండ‌వు. సాధార‌ణంగా పండుగ‌లు, ముఖ్య‌మైన రోజుల్లో వినియోగ‌దారులు పంపుకునే ఎస్ఎంఎస్‌ల‌కు చార్జిలు వేస్తారు. ఆ రోజు ఎలాంటి స్పెష‌ల్ ప్యాక్స్‌, ఎస్ఎంఎస్ ప్యాక్‌లు ప‌నిచేయ‌వు. ఆ రోజుల్లో పంపుకునే ఎస్ఎంఎస్‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు చార్జిల‌ను విధిస్తూ వ‌చ్చారు. అయితే జియో రాక‌తో ఇత‌ర టెలికాం నెట్‌వ‌ర్క్‌ల‌కు పెద్ద స‌మ‌స్య ఎదురైంది. ఆ కంపెనీ బ్లాక్ అవుట్ డేల‌లోనూ ఎస్ఎంఎస్‌ల‌కు చార్జిలు విధించ‌డం లేదు. దీంతో బీఎస్ఎన్ఎల్‌, వొడాఫోన్‌, ఐడియాలు ఇప్పుడు జియో బాట ప‌ట్టాయి. నేటి నుంచి మొద‌లుకొని 2019లో వ‌చ్చే ప్ర‌త్యేక రోజులు, పండుగ రోజుల్లో వినియోగ‌దారులు పంపుకునే ఎస్ఎంఎస్‌ల‌కు చార్జిలు విధించ‌బోమని, వారు య‌థావిధిగా త‌మ ఎస్ఎంఎస్ ప్యాక్‌ల‌ను వాడుకోవ‌చ్చ‌ని ఈ కంపెనీలు తెలిపాయి. అంటే ఇక‌పై ఈ నెట్‌వ‌ర్క్‌ల‌లో బ్లాక్ అవుట్ డేస్ ఉండ‌వ‌న్న‌మాట‌. అయితే ఎయిర్‌టెల్ మాత్రం ఇంకా ఈ విషయంపై ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేదు.

7801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles