రూ.151 అభినందన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్


Thu,June 13, 2019 10:47 PM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.151 అభినందన్ ప్లాన్‌ను తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఇవాళ ప్రవేశపెట్టింది. ఇందులో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 180 రోజులుగా నిర్ణయించారు. కాకపోతే ఈ ప్లాన్ ద్వారా అందించే ప్రయోజనాలు మాత్రం కేవలం 24 రోజుల వాలిడిటీతో వస్తాయి. అంటే ప్లాన్ 180 రోజుల వరకు వాలిడిటీలో ఉంటుంది కానీ దానికి అందించే అన్ని బెనిఫిట్స్ మాత్రం 24 రోజుల వరకే వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత అవన్నీ లభించవు. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బీఎస్‌ఎన్‌ఎల్ సర్కిళ్లలోని వినియోగదారులు ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.

3382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles