బాన్స్‌వాడలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు...


Thu,February 14, 2019 01:02 PM

నిజామాబాద్‌: బాన్స్‌వాడలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు ప్రారంభమయ్యాయి. తాను దత్తత తీసుకున్న గ్రామం కందకుర్తిలో ఎంపీ కవిత బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ టవర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... ప్రైవేటు పోటీని తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను టెలికాం అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చర్చిస్తాంమని తెలిపారు.బీఎస్ఎన్ఎల్ మన ఇంటి సంస్థ. సీఎం కేసిఆర్ బీఎస్ఎన్ఎల్ ను ప్రోత్సహించాలని అందరికీ చెప్తుంటారు. నిజామాబాద్ నగరంలో 58 వైఫై హాట్ స్పాట్స్ అందుబాటులో ఉన్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న టీ హబ్‌కు టెలికం సర్వీసులు అందించేందుకు టీ హబ్‌ లో కార్యాలయాలు ఏర్పాటు చేసే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఆదాయం పెంచుకోవచ్చిన వెల్లడించారు. అనంతరం నిజామాబాద్ టెలికాం అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఎంపీ కవిత పాల్గొన్నారు.

1103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles