రూ.5499కే బోట్ స్టోన్ 1400 వైర్‌లెస్ వాట‌ర్ రెసిస్టెంట్ స్పీక‌ర్


Sat,May 11, 2019 03:40 PM

బోట్ కంపెనీ స్టోన్ 1400 పేరిట ఓ నూత‌న వైర్‌లెస్ స్పీక‌ర్‌ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ స్పీక‌ర్ల‌లో 70 ఎంఎం డ్రైవ‌ర్ ఉంది. అందువ‌ల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. ఇక ఈ స్పీక‌ర్లు 30 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను ఇస్తాయి. అలాగే ఈ స్పీక‌ర్ల‌కు వాట‌ర్ రెసిస్టెంట్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. బ్లూటూత్ 4.2 ఉన్న డివైస్‌ల‌కు ఈ స్పీక‌ర్ క‌నెక్ట్ అవుతుంది. ఇందులో 2500 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల 7 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంది. యూఎస్బీ టైప్ సి చార్జింగ్ పాయింట్‌ను ఈ స్పీక‌ర్‌ను అందిస్తున్నారు. రూ.5499 ధ‌ర‌కు ఈ స్పీక‌ర్ అమెజాన్‌లో వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

2388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles