రూ.1299 కే బోట్ బాస్‌హెడ్స్ 950 హెడ్‌ఫోన్స్


Thu,June 20, 2019 07:33 PM

బోట్ కంపెనీ బాస్‌హెడ్స్ 950 పేరిట నూతన హెడ్‌ఫోన్స్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వీటికి డ్యుయల్ టోన్ మెటలిక్ ఫినిషింగ్‌ను ఇచ్చారు. అందువల్ల ఇవి ప్రీమియం లుక్‌తో కనిపిస్తాయి. అలాగే చెవులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు గాను వీటికి సాఫ్ట్ ప్యాడింగ్‌ను ఏర్పాటు చేశారు. 40 ఎంఎం డ్రైవర్ యూనిట్ ఉండడం వల్ల ఈ హెడ్‌ఫోన్స్ నాణ్యమైన సౌండ్ అవుట్‌పుట్‌ను ఇస్తాయి. కాగా ఈ హెడ్‌ఫోన్స్ రూ.1299 ధరకు వినియోగదారులకు అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నాయి. అయితే లాంచింగ్ సందర్భంగా వీటిని రూ.1099 కే పొందవచ్చు.

2068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles