భార‌త్‌లో విడుద‌లైన షియోమీ కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్.. బ్లాక్ షార్క్ 2..!


Mon,May 27, 2019 02:40 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న గేమింగ్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ షార్క్ 2 ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.39 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 12 జీబీ ర్యామ్‌లను అమ‌ర్చినందున ఫోన్ వేగ‌వంత‌మైన ప్ర‌దర్శ‌న‌ను ఇస్తుంది. అలాగే ఇందులో లిక్విడ్ కూలింగ్ టెక్నాల‌జీ అనే ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా, నెట్ ఆన్ చేసినా ఫోన్ ఎక్కువ హీట్ అవ‌కుండా ఉంటుంది.

అలాగే ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేయ‌గా, 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఇందులో అందిస్తున్నారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ కూడా ఉంది. అలాగే కేవ‌లం 5 నిమిషాల పాటు ఫోన్‌ను చార్జింగ్ పెడితే 30 నిమిషాల పాటు ఇందులో గేమ్స్ ఆడుకోవ‌చ్చు. ఇక ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.39,999 ధ‌ర‌కు ల‌భ్యం కానుండ‌గా, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.49,999 ధ‌ర‌కు ల‌భ్యం కానుంది. జూన్ 4వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యించ‌నున్నారు.

బ్లాక్ షార్క్ 2 ఫీచ‌ర్లు...


6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

2324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles