రూ.10వేల లోపు లభిస్తున్న బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే..!


Sun,June 17, 2018 05:26 PM

నేడు నడుస్తున్నదంతా టెక్ యుగం. ఎప్పటికప్పుడు టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం కూడా అప్‌డేటెడ్‌గా ఉండాలి. అందులో భాగంగానే చాలా మంది తరచూ తమ ఫోన్లను మారుస్తూ, కొత్త డివైస్‌లకు అప్‌గ్రేడ్ అవుతూ ఉంటారు. అందుకనే అలాంటి వారి అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లు కలిగిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరలకే అందిస్తున్నాయి కూడా. మరి రూ.10వేల లోపు ధర కలిగిన అలాంటి బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

1. షియోమీ రెడ్‌మీ నోట్ 5

6 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 12, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.9,999.

2. ఇన్ఫినిక్స్ హాట్ ఎస్3

5.6 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13, 20 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర రూ.8,999.

3. స్మార్ట్రన్ టి.ఫోన్ పి

5.2 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ధర రూ.7,999.

4. షియోమీ రెడ్‌మీ 5ఎ

5 ఇంచుల డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ధర రూ.6,999.

5. షియోమీ రెడ్‌మీ వై1

5.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 13, 16 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ధర రూ.8,999.

6. లెనోవో కె8 ప్లస్

5.2 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ధర రూ.9,999.

7. షియోమీ రెడ్‌మీ నోట్ 4

5.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ధర రూ.7,999.

7309

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles