వాట్సాప్ కొత్త అప్‌డేట్‌తో ఆండ్రాయిడ్, ఐఫోన్లలో బ్యాటరీ సమస్యలు..!


Sat,November 9, 2019 12:16 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజంగ్ యాప్ వాట్సాప్ తాజాగా ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు నూతన అప్‌డేట్‌ను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ అప్‌డేట్ వల్ల ఆయా ఫోన్లలో బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోతుందని వినియోగదారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో వాట్సాప్‌కు సమస్యను వివరిస్తున్నారు.

వాట్సాప్‌లో ఇటీవల వచ్చిన అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఫోన్లలో బ్యాటరీ త్వరగా అయిపోవడమే కాక, డివైస్ బ్యాక్‌గ్రౌండ్‌లోనూ వాట్సాప్ యాప్ ఎక్కువ బ్యాటరీని ఉపయోగించుకుంటుందని, అలాగే ఆ యాప్ యాక్టివిటీ పెరిగిందని వినియోగదారులు పేర్కొంటున్నారు. కాగా ఈ విషయంపై వాట్సాప్ ఇంకా స్పందించలేదు. కానీ ఈ సమస్యను త్వరలోనే ఫిక్స్ చేసి మరో నూతన అప్‌డేట్‌ను వాట్సాప్ అందిస్తుందని తెలిసింది.

1997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles