అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2 స్మార్ట్‌ఫోన్ విడుదల


Wed,December 12, 2018 08:19 PM

అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2 ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ కెమెరా రెండు ఉండగా, ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా ఒకటి ఉంది. దీనికి ఫ్లాష్ సదుపాయం కల్పించారు. అలాగే ఫేస్ అన్‌లాక్ సదుపాయం కూడా సెల్ఫీ కెమెరాకు ఉంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో డెడికేటెడ్ మెమొరీ కార్డు స్లాట్‌ను ఏర్పాటు చేశారు. డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈకి ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఈ పోన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను ఇచ్చారు.

అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2 బ్లూ, టైటానియం కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.12,999 ధరకు లభిస్తున్నది. అలాగే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.14,999 ధరకు, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999 ధరకు లభిస్తున్నాయి. ఈ ఫోన్లను ఈ నెల 18వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నారు.

అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2 ఫీచర్లు...


6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

3593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles