అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2 స్మార్ట్‌ఫోన్ విడుదల


Thu,December 6, 2018 06:15 PM

అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2ను ఇవాళ విడుదల చేసింది. రూ.19,140 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 12వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఇందులో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి ఫ్లాష్ సదుపాయం అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. డెడికేటెడ్ మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్‌ను కూడా ఏర్పాటు చేశారు. డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ సపోర్ట్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉంది.

అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2 ఫీచర్లు...


6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

1268

More News

VIRAL NEWS