అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 స్మార్ట్‌ఫోన్ విడుదల


Thu,December 6, 2018 04:24 PM

అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 ను ఇవాళ విడుదల చేసింది. ఇందులో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి ఫ్లాష్ సదుపాయం కూడా కల్పించారు. ఈ ఫోన్‌లో డెడికేటెడ్ మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈకి సపోర్ట్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 బ్లాక్, బ్లూ, గోల్డ్ కలర్ వేరియెంట్లలో రూ.13,810 ధరకు వినియోగదారులకు అతి త్వరలో లభ్యం కానుంది.

అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 ఫీచర్లు...


6.3 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

1289

More News

VIRAL NEWS