రూ.7,499కే అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1 స్మార్ట్‌ఫోన్


Sat,October 20, 2018 08:16 PM

అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 5.45 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను అమర్చారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండగా, 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చారు. బ్లాక్, గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.8,999 ధరకు లభిస్తున్నది. కానీ పండుగల సీజన్ సందర్భంగా ఈ ఫోన్‌ను రూ.7,499 ధరకే విక్రయించనున్నారు. ఫ్లిప్‌కార్ట్ త్వరలో నిర్వహించనున్న ధమాకా డేస్ సేల్‌లో ఈ ఫోన్‌ను విక్రయిస్తారు. కాగా లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్ కొనుగోలుపై పలు ఆఫర్లను కూడా అందివ్వనున్నారు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన జియో కస్టమర్లకు రూ.2200 విలువైన క్యాష్‌బ్యాక్ వోచర్ల రూపంలో లభిస్తుంది. 50 జీబీ అదనపు డేటాను ఇస్తారు. కేవలం రూ.99కే ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఇస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు వీలు కల్పించారు.

అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1 ఫీచర్లు...


5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

8478

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles