అసుస్ నుంచి జెన్‌ఫోన్ లైవ్ ఎల్1 స్మార్ట్‌ఫోన్


Sat,May 19, 2018 07:20 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్1 ను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనుంది. 2/3 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదల కానున్న ఈ ఫోన్ వరుసగా రూ.6,740, రూ.8,190 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి. ముందు భాగంలో ఉన్న కెమెరాకు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు.

అసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్1 ఫీచర్లు...

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

4780
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles