అసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1 స్మార్ట్‌ఫోన్ విడుదల


Sun,October 28, 2018 12:05 PM

అసుస్.. తన నూతన స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1 ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.6,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన జియో కస్టమర్లకు రూ.2200 క్యాష్‌బ్యాక్‌ను వోచర్ల రూపంలో అందిస్తున్నారు. దీంతోపాటు జియో 50 జీబీ అదనపు డేటాను ఉచితంగా అందిస్తున్నది. అలాగే రూ.99కే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్నది.

అసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1 ఫీచర్లు...

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

2156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles