జెన్‌ఫోన్ లైట్ ఎల్‌1, మ్యాక్స్ ఎం1 ఫోన్ల ధ‌ర‌లు త‌గ్గింపు


Mon,April 22, 2019 04:27 PM

అసుస్ కంపెనీ త‌న జెన్‌ఫోన్ లైట్ ఎల్‌1, మ్యాక్స్ ఎం1 ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1 ధ‌ర రూ.7499 ఉండ‌గా ఇప్పుడ‌ది రూ.500 త‌గ్గింది. దీంతో ఈ ఫోన్‌ను రూ.6,999 ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే జెన్‌ఫోన్ లైట్ ఎల్‌1 ధ‌ర రూ.5,999 ఉండ‌గా ఈ ఫోన్ ధ‌ర‌ను రూ.1వేయి త‌గ్గించారు. దీంతో యూజ‌ర్లు ఇప్పుడీ ఫోన్‌ను రూ.4,999 ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం త‌గ్గించిన ధ‌ర‌ల‌కే ఈ ఫోన్ల‌ను అసుస్ విక్ర‌యిస్తున్న‌ది. కాగా ఈ ఫోన్ల‌ను ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో విక్ర‌యిస్తున్నారు.

2381
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles