ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లతో విడుద‌లైన అసుస్ జెన్‌ఫోన్ 6 స్మార్ట్‌ఫోన్


Sat,May 18, 2019 02:19 PM

అసుస్ కంపెనీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ 6 ను స్పెయిన్ మార్కెట్‌లో తాజాగా విడుద‌ల చేసింది. ఇందులో 6.46 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్, 8 జీబీ ర్యామ్‌ల‌ను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగంగా ప‌నిచేస్తుంది. ఆండ్రాయిడ్ 9.0 పై ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ వెనుక భాగంలో ఉంది. ఈ ఫోన్ వెనుక భాగానికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

అసుస్ జెన్‌ఫోన్ 6 స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్‌, ట్విలైట్ సిల్వ‌ర్ క‌ల‌ర్ ఆప్ష‌న్లలో విడుద‌ల కాగా ఈ ఫోన్‌కు చెందిన 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.39,132 ధ‌ర‌కు ల‌భ్యం కానుంది. అలాగే 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.43,800 ధ‌రకు, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.46,970 ధ‌ర‌కు ల‌భ్యం కానున్నాయి. మే 25వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు.

అసుస్ జెన్‌ఫోన్ 6 ఫీచ‌ర్లు...


6.46 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్‌.

3412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles