అదిరిపోయే ఫీచర్లతో అసుస్ జెన్‌ఫోన్ 5జడ్


Wed,July 4, 2018 03:49 PM

మొబైల్స్ తయారీదారు అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ 5జడ్‌ను ఇవాళ విడుదల చేసింది. 6/8 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.29,999, రూ.36,999 ధరలకు వినియోగదారులకు ఈ నెల 9వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభ్యం కానుంది. ఫోన్ లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు.

ఐసీఐసీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.3వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే రూ.499 కే ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. రూ.3,333 నెలవారీ ఈఎంఐతో నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక జియో ఈ ఫోన్‌పై రూ.2200 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నది.

అసుస్ జెన్‌ఫోన్ 5జడ్ ఫీచర్లు...

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

1949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles