ప్రపంచంలోనే అత్యంత సన్నదైన కన్వర్టబుల్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన అసుస్


Mon,March 19, 2018 04:10 PM

అసుస్ సంస్థ జెన్‌బుక్ ఫ్లిప్ ఎస్ పేరిట ప్రపంచంలోనే అత్యంత సన్నదైన కన్వర్టబుల్ ల్యాప్‌టాప్‌ను తాజాగా విడుదల చేసింది. కేవలం 10.9 ఎంఎం మందాన్ని మాత్రమే ఈ ల్యాప్‌టాప్ కలిగి ఉంది. దీని బరువు 1.1 కేజీలు మాత్రమే. రూ.1,30,990 ధరకు ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ల్యాప్‌టాప్‌ను ట్యాబ్లెట్ పీసీగా కూడా వాడుకోవచ్చు. ఒక సారి దీన్ని ఫుల్ చార్జింగ్ చేస్తే 11 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.

అసుస్ జెన్‌బుక్ ఫ్లిప్ ఎస్ ఫీచర్లు...


13.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అల్ట్రా స్లిమ్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఇంటెల్ కోర్ ఐ7 8వ జనరేషన్ ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీ, విండోస్ 10 ఓఎస్, వీజీఏ వెబ్ కెమెరా, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి, 11 గంటల బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ చార్జింగ్.

2553

More News

VIRAL NEWS

Featured Articles