అసుస్ వివోబుక్ 15 ఎక్స్510 ల్యాప్‌టాప్ విడుదల


Sun,September 16, 2018 03:01 PM

వివోబుక్ 15 ఎక్స్510 పేరిట అసుస్ ఓ నూతన ల్యాప్‌టాప్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.45,990 ధరకు ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో 15.6 ఇంచ్ డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8 గంటల బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ల్యాప్ 0 నుంచి 60 శాతం చార్జింగ్ పూర్తయ్యేందుకు కేవలం 49 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అలాగే ఇందులో ఎన్‌వీడియా జిఫోర్స్ ఎంఎక్స్130 గ్రాఫిక్స్‌ను, 1టీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌తోపాటు ఇతర రిటెయిల్ స్టోర్స్‌లోనూ ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు లభిస్తున్నది.

1316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles