రేప‌టి నుంచి అసుస్‌ ఓమైగాడ్ (ఓఎంజీ) సేల్‌.. భారీ త‌గ్గింపు ధ‌ర‌కు ఫోన్లు..!


Tue,February 5, 2019 05:48 PM

మొబైల్స్ త‌యారీదారు అసుస్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌లు క‌లిసి రేప‌టి నుంచి ఓఎంజీ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తున్నాయి. ఈ సేల్ ఈ నెల 9వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. కాగా 2018లో 20 ల‌క్ష‌ల అసుస్ ఫోన్ల అమ్మ‌కం జ‌రిగినందుకు గాను ఆ కంపెనీ ఈ సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ఇందులో భాగంగా జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 ఫోన్‌కు చెందిన అన్ని వేరియెంట్ల‌పై రూ.1500 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 ఫోన్లు, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2 ఫోన్ల‌పై రూ.1000 డిస్కౌంట్‌ను, జెన్‌ఫోన్ 5జ‌డ్‌కు చెందిన అన్ని వేరియెంట్ల‌పై రూ.8వేల భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే జెన్‌ఫోన్ లైట్ ఎల్‌1పై రూ.1వేయి త‌గ్గింపును అందిస్తున్నారు. దీంతోపాటు ఫోన్ల‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం, కేవ‌లం రూ.99 కే ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్ష‌న్ ప్లాన్‌ల‌ను కూడా అందిస్తున్నారు. నేటి అర్థ‌రాత్రి నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది.

3091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles