ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భారీ తగ్గింపు ధరలకు అసుస్ ఫోన్లు..!


Sun,October 7, 2018 04:02 PM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనున్న విషయం విదితమే. కాగా ఈ సేల్‌లో భాగంగా పలు అసుస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు. అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 3జీబీ ర్యామ్ వేరియెంట్‌పై రూ.1వేయి తగ్గించారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.9,999 ధరకు సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.2వేల తగ్గింపు ధరతో రూ.10,999 ధరకు, 6 జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.2వేల తగ్గింపు ధరతో రూ.12,999 ధరకు లభ్యం కానున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అసుస్ జెన్‌ఫోన్ 5జడ్ ఎం1 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.5వేల తగ్గింపు ధరతో రూ.24,999 ధరకు లభ్యం కానుండగా, ఇదే ఫోన్‌కు చెందిన 128 జీబీ వేరియెంట్ రూ.5వేల తగ్గింపుతో రూ.27,999 ధరకు, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.5వేల తగ్గింపుతో రూ.31,999 ధరకు లభ్యం కానున్నాయి. అలాగే ఈ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందివ్వనున్నారు. దీంతోపాటు రూ.799 విలువైన మొబైల్ ప్రొటెక్షన్, రూ.99కే బైబ్యాక్ వాల్యూ తదితర ఆఫర్లను కూడా అందివ్వనున్నారు. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఫోన్లను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.

5538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles