Telangana Intermediate 1st & 2nd Year Results 2019

మిలిట‌రీ గ్రేడ్ ప్ర‌మాణాల‌తో అసుస్ కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌లు..!


Mon,March 25, 2019 11:44 AM

కంప్యూట‌ర్స్ ఉత్ప‌త్తుల త‌యారీదారు అసుస్ రెండు నూత‌న గేమింగ్ ల్యాప్‌టాప్‌ల‌ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. టీయూఎఫ్ ఎఫ్ఎక్స్‌505డీవై, టీయూఎఫ్ ఎఫ్ఎక్స్‌705డీవై పేరిట ఈ ల్యాప్‌టాప్‌లు విడుద‌ల‌య్యాయి. టీయూఎఫ్ ఎఫ్ఎక్స్505డీవై ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచ్ డిస్‌ప్లే, 32 జీబీ వ‌ర‌కు ర్యామ్ స‌పోర్ట్‌, 128 జీబీ నుంచి 1 టీబీ వ‌ర‌కు ఎస్ఎస్‌డీ ఆప్ష‌న్లు, ఏఎండీ రైజెన్ 5 ప్రాసెస‌ర్‌, రేడియాన్ ఆర్ఎక్స్ 560ఎక్స్ గ్రాఫిక్స్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధ‌ర రూ.59,990 గా ఉంది. అలాగే టీయూఎఫ్ ఎఫ్ఎక్స్‌705డీవై ల్యాప్‌టాప్‌లో 17.3 ఇంచ్ డిస్‌ప్లే, ఏఎండీ రైజెన్ 5 ప్రాసెస‌ర్‌, రేడియాన్ ఆర్ఎక్స్ 560ఎక్స్ గ్రాఫిక్స్‌, 32 జీబీ వ‌ర‌కు ర్యామ్‌కు స‌పోర్ట్‌, 1 టీబీ ఎస్ఎస్‌డీ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధ‌ర రూ.64,990 గా ఉంది. కాగా రెండు ల్యాప్‌టాప్‌లు మిలిటరీ గ్రేడ్ ప్ర‌మాణాలను క‌లిగి ఉన్నాయి. అందువ‌ల్ల ఇవి చాలా దృఢంగా ఉంటాయి.

703

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles