జెన్‌బుక్ సిరీస్‌లో అసుస్ 3 కొత్త ల్యాప్‌టాప్‌లు..


Tue,September 10, 2019 12:09 PM

జెన్‌బుక్ సిరీస్‌లో అసుస్ సంస్థ మూడు నూతన ల్యాప్‌టాప్‌లను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. జెన్‌బుక్ ఫ్లిప్ 13, జెన్‌బుక్ 14, 15 మోడల్స్‌లో ఆ ల్యాప్‌టాప్‌లు విడుదలయ్యాయి. జెన్‌బుక్ ఫ్లిప్ 13 ల్యాప్‌టాప్‌లో 13.3 ఇంచ్ డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఇంటెల్ అల్ట్రా హెచ్‌డీ గ్రాఫిక్స్, 16 జీబీ వరకు ర్యామ్‌కు సపోర్ట్, 512 జీబీ వరకు ఎస్‌ఎస్‌డీ సపోర్ట్, విండోస్ 10 హోం, 50 వాట్ అవర్ 3 సెల్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

జెన్‌బుక్ 14 ల్యాప్‌టాప్‌లో 14 ఇంచ్ డిస్‌ప్లే, 5.65 ఇంచ్ సెకండరీ డిస్‌ప్లే (సెకండరీ టచ్ ప్యాడ్), ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఎన్‌వీడియా జిఫోర్స్ ఎంఎక్స్250 గ్రాఫిక్స్, 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు ఎస్‌ఎస్‌డీ సపోర్ట్, 50 వాట్ అవర్ 3 సెల్ బ్యాటరీ, విండోస్ 10 హోం తదితర ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే జెన్‌బుక్ 15 ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచ్ డిస్‌ప్లే, 5.65 ఇంచుల సెకండరీ డిస్‌ప్లే (సెకండరీ టచ్ ప్యాడ్), ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఎన్‌వీడియా జిఫోర్స్ జీటీఎక్స్ 1650 మ్యాక్స్ క్యూ గ్రాఫిక్స్, 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు ఎస్‌ఎస్‌డీ సపోర్ట్, 71 వాట్ అవర్ 8 సెల్ బ్యాటరీ, విండోస్ 10 హోం తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

అసుస్ జెన్‌బుక్ ఫ్లిప్ 13 ప్రారంభ ధర రూ.76,990 ఉండగా, జెన్‌బుక్ 14 రూ.79,990, జెన్‌బుక్ 15 రూ.1,19,990 ప్రారంభ ధరలకు అందుబాటులో ఉన్నాయి. వీటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్‌లలో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles