ఫ్లిప్‌కార్ట్‌లో అసుస్ డేస్ సేల్.. భారీ త‌గ్గింపు ధ‌ర‌కు అసుస్ ఫోన్లు..!


Thu,January 10, 2019 10:28 AM

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న వెబ్‌సైట్‌లో అసుస్ ఇండియాతో క‌లిసి అసుస్ డేస్ సేల్‌ను నిన్న ప్రారంభించింది. ఈ సేల్ రేప‌టి వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఇందులో ప‌లు అసుస్ ఫోన్లపై ఆక‌ట్టుకునే రాయితీలు, ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా అసుస్ జెన్‌ఫోన్ 5జ‌డ్ (8జీబీ, 256 జీబీ) రూ.8వేల త‌గ్గింపుతో రూ.28,999 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.8వేల త‌గ్గింపుతో రూ.24,999 ధ‌ర‌కు, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.1వేయి తగ్గింపుతో రూ.12,999 ధ‌ర‌కు, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,999 ధ‌ర‌కు, 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.8,999 ధ‌ర‌కు, అసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్‌1 రూ.4,999 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. వీటికి త‌క్కువ ధ‌ర‌కే మొబైల్ ప్రొటెక్ష‌న్ ప్లాన్‌ను కూడా అందిస్తున్నారు.

2062

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles