అసుస్ కంప్యూట‌ర్ యూజ‌ర్లు జాగ్ర‌త్త‌.. పీసీల్లోకి చొర‌బ‌డుతున్న మాల్‌వేర్‌..!


Tue,March 26, 2019 01:21 PM

కంప్యూట‌ర్స్ ఉత్ప‌త్తుల తయారీ కంపెనీ అసుస్‌కు చెందిన కంప్యూట‌ర్ల‌ను వాడుతున్నారా ? అయ‌తే జాగ్ర‌త్త‌. మీ పీసీని వెంట‌నే ప‌టిష్ట‌మైన యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్‌తో స్కాన్ చేసుకోండి. ఎందుకంటే.. కొంద‌రు హ్యాక‌ర్లు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అసుస్ కంప్యూట‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని మాల్‌వేర్‌ను అసుస్ స‌ర్వ‌ర్ల‌లోకి చొప్పించారని స‌మాచారం అందుతోంది. ప్ర‌ముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థ కాస్ప‌ర్‌స్కై ఈ మేర‌కు వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

ర‌ష్యా, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌ల‌తోపాటు ప్ర‌పంచంలోని ప‌లు దేశాల‌లో అసుస్ కంప్యూట‌ర్లను వాడే యూజ‌ర్ల పీసీల్లో ఉండే అసుస్ లైవ్ అప్‌డేట్స్ అనే సాఫ్ట్‌వేర్‌ను కొంద‌రు హ్యాక‌ర్లు హ్యాక్ చేశార‌ని కాస్ప‌ర్ స్కై చెబుతున్న‌ది. దీని వ‌ల్ల ఆ పీసీల్లోకి మాల్‌వేర్ చొర‌బ‌డింద‌ని, ఈ క్ర‌మంలో స‌ద‌రు యూజ‌ర్లు త‌మ యాంటీ వైర‌స్‌తో పీసీల‌ను స్కాన్ చేస్తే అస‌లు విష‌యం తెలిసింద‌ని కాస్ప‌ర్ స్కై వెల్ల‌డించింది. కాగా మొత్తం 10 ల‌క్ష‌ల‌కు పైగా కంప్యూట‌ర్లు ఈ మాల్‌వేర్ బారిన పడి ఉంటాయ‌ని ఆ కంపెనీ అంచ‌నా వేస్తున్న‌ది. ఈ క్ర‌మంలో అసుస్ కంప్యూట‌ర్ల‌ను వాడుతున్న యూజ‌ర్లు ప‌టిష్ట‌మైన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌తో త‌మ పీసీల‌ను పూర్తిగా స్కాన్ చేసుకోవాలని ఆ కంపెనీ హెచ్చ‌రిస్తున్న‌ది.

969

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles