అసుస్ బ్యాక్ టు స్కూల్ ఆఫ‌ర్‌.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ల్యాప్‌టాప్‌లు..!


Mon,April 15, 2019 07:46 PM

కంప్యూట‌ర్స్ ఉత్ప‌త్తుల త‌యారీదారు అసుస్ భార‌త్‌లోని స్టూడెంట్ల కోసం బ్యాక్ టు స్కూల్ పేరిట ఓ నూత‌న ఆఫ‌ర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా త‌గ్గింపు ధ‌ర‌ల‌కే అసుస్ ల్యాప్‌టాప్‌ల‌తోపాటు ప‌లు ఇత‌ర కంప్యూట‌ర్ ఉత్ప‌త్తులు విద్యార్థుల‌కు ల‌భిస్తాయి. దీంతోపాటు వ‌డ్డీ లేని నెల‌స‌రి వాయిదాల‌తో ల్యాప్‌టాప్‌ల‌ను కొనే ఆఫ‌ర్‌ను కూడా అసుస్ అందిస్తున్న‌ది. ఇక ఈ ఆఫ‌ర్లో భాగంగా కొనే ఉత్ప‌త్తుల‌కు 2 సంవ‌త్స‌రాల వారంటీని అసుస్ అందిస్తున్న‌ది.

బ్యాక్ టు స్కూల్ ఆఫ‌ర్‌లో భాగంగా కేవ‌లం రూ.499 చెల్లిస్తే అద‌నంగా మ‌రో ఏడాది వారంటీని అసుస్ ల్యాప్‌టాప్‌ల‌కు పొంద‌వ‌చ్చు. అలాగే రూ.1799 చెల్లిస్తే అద‌నంగా మ‌రో 2 ఏళ్లు క‌లిపి మొత్తం మూడు సంవ‌త్స‌రాలు వారంటీ ల‌భిస్తుంది. ఇక గేమింగ్ ల్యాప్‌టాప్‌ల‌కు ఏడాది అద‌న‌పు వారంటీ కావాలంటే కేవ‌లం రూ.999 చెల్లిస్తే చాలు. అదే మూడు సంవ‌త్స‌రాల‌కు అయితే రూ.2499 చెల్లించాలి. ఇక ఈ ల్యాప్‌టాప్‌ల‌లో అందించే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోం అండ్ స్టూడెంట్ ఎడిష‌న్ 2016 సాఫ్ట్‌వేర్‌ను త‌గ్గింపు ధ‌ర‌కు ఇవ్వ‌నున్నారు.

ఆఫ‌ర్‌లో భాగంగా అసుస్ ఏఐవో, వివోబుక్‌, ఈబుక్‌లను కొనేవారు రూ.2499 చెల్లిస్తే 1టీబీ హార్డ్‌డిస్క్‌డ్రైవ్ ఇస్తారు. ఇక వివోబుక్ ఎస్‌ను కొంటే రూ.1,999 కు, జెన్‌బుక్‌ను కొంటే రూ.1599కు హార్డ్ డిస్క్ డ్రైవ్ ఇస్తారు. అసుస్ ల్యాప్‌టాప్‌ల‌ను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేసే స‌దుపాయాన్ని అందిస్తున్నారు. కాగా ఈ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ మే 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

2967

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles