ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన అసుస్ 6జడ్ స్మార్ట్‌ఫోన్


Wed,June 19, 2019 04:59 PM

అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 6జడ్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.46 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ నో నాచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ఇది ఫ్లిప్ అప్ కెమెరా కనుక దీన్ని సెల్ఫీ కెమెరాగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్లను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి క్విక్ చార్జ్ 4.0 ఫీచర్‌ను అందిస్తున్నారు.

అసుస్ 6జడ్ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.31,999 ఉండగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.34,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.39,999 గా ఉంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. కాగా ఈ ఫోన్‌ను కొన్నవారికి రూ.3,999 విలువైన ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కేవలం రూ.99కే అందివ్వనున్నారు.

అసుస్ 6జడ్ ఫీచర్లు...


6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 48, 13 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0, ఫాస్ట్ చార్జింగ్.

1841
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles