ఈ నెల 19న విడుదల కానున్న అసుస్ 6జడ్ స్మార్ట్‌ఫోన్


Sat,June 8, 2019 07:36 PM

అసుస్ కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ అసుస్ 6జడ్‌ను ఈ నెల 19వ తేదీన భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.

ఈ ఫోన్‌లో 6.46 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ నానో ఎడ్జ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. అలాగే వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా.. దీనికి క్విక్ చార్జ్ 4.0 సదుపాయాన్ని అందిస్తున్నారు.

అసుస్ 6జడ్ ఫోన్ ఫీచర్లు...


6.46 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 48, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

4249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles