మొబైల్స్ తయారీదారు అసుస్ తన 5జడ్, 6జడ్ ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. అసుస్ 6జడ్ ఫోన్కు చెందిన వేరియెంట్ల ధరలు రూ.5వేల వరకు తగ్గగా, అసుస్ 5జడ్ వేరియెంట్ల ధరలు రూ.7వేల వరకు తగ్గాయి. ఈ క్రమంలో తగ్గిన ఫోన్ల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. అసుస్ 6జడ్ (6జీబీ, 64జీబీ) - రూ.31,999 (పాత ధర) - రూ.27,999 (కొత్త ధర) అసుస్ 6జడ్ (6జీబీ, 128జీబీ) - రూ.34,999 - రూ.30,999అసుస్ 6జడ్ (8జీబీ, 256జీబీ) - రూ.39,999 - రూ.34,999అసుస్ 5జడ్ (6జీబీ, 64జీబీ) - రూ.21,999 - రూ.16,999అసుస్ 5జడ్ (6జీబీ, 128జీబీ) - రూ.24,999 - రూ.18,999 అసుస్ 5జడ్ (8జీబీ, 256జీబీ) - రూ.28,999 - రూ.21,999 కాగా ప్రస్తుతం తగ్గించిన ధరలకే ఈ ఫోన్లను విక్రయిస్తున్నారు. ఇక అసుస్ 5జడ్ స్మార్ట్ఫోన్లో 6.2 ఇంచుల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తుండగా.. అసుస్ 6జడ్ స్మార్ట్ఫోన్లో.. 6.46 ఇంచుల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, 48, 12, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.