పాస్‌పోర్టుకు అప్లై చేస్తున్నారా..? ఈ సైట్లతో జాగ్రత్త..!


Tue,November 12, 2019 11:58 AM

ప్రస్తుత తరుణంలో ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా నకిలీ సైట్లు, యాప్‌లు రాజ్యమేలుతున్నాయి. వాటి బారిన పడి ఎంతో మంది ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. అనేక మంది డబ్బును నష్టపోవడమే కాకుండా వారి వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురవుతోంది. ఈ క్రమంలోనే అలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్త చర్యగా పాస్‌పోర్టులకు అప్లై చేసే వారిని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది.

పాస్‌పోర్టుకు అప్లై చేసే వారు లేదా పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకునే వారు ఆన్‌లైన్‌లో పాస్‌పోర్టు సైట్ లేదా స్మార్ట్‌ఫోన్ యాప్‌లో దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు పాస్‌పోర్టు అప్లై, రెన్యూ పేరిట నకిలీ సైట్లు, యాప్‌లను సృష్టించి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడే passportindia.gov.in, portal2.passportindia.gov.in వెబ్‌సైట్లు, mPassport Seva అనే యాప్ తప్ప ఇతర ఏ సైట్, యాప్ జోలికి వెళ్లకూడదని సంబంధిత శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చెలామణీలో ఉన్న పలు నకిలీ పాస్‌పోర్టు సైట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

indiapassport.org, online-passportindia.com, passportindiaportal.in, passport-india.in, passport-seva.in, applypassport.org తదితర నకిలీ పాస్‌పోర్టు సైట్లు ప్రస్తుతం నెట్‌లో అందుబాటులో ఉన్నాయని, వీటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

1361
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles