ట్రిపుల్‌ బ్యాక్‌ కెమెరాలతో వస్తున్న యాపిల్‌ కొత్త ఐఫోన్లు..?


Wed,April 10, 2019 11:52 AM

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ యాపిల్‌ ఈ ఏడాది మూడు నూతన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుందని గతంలో వార్తలు వచ్చిన విషయం విదితమే. కాగా ఆ ఫోన్లలో 6.1, 6.5 ఇంచుల ఓలెడ్‌ డిస్‌ప్లేలు ఉంటాయని తెలిసింది. అయితే ఆ ఫోన్లలో వెనుక భాగంలో ట్రిపుల్‌ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.

యాపిల్‌ తన నూతన ఐఫోన్లలో వెనుక భాగంలో ఏర్పాటు చేస్తున్న ట్రిపుల్‌ కెమెరాలు భారీ మెగాపిక్సల్‌ కెపాసిటీని కలిగి ఉంటాయని తెలుస్తున్నది. అలాగే ఆ ఫోన్లలో బైలేటరల్‌ వైర్‌లెస్‌ చార్జింగ్‌ ఫీచర్‌ను కూడా అందివ్వనున్నారని సమాచారం. ఐఫోన్‌ XI, ఐఫోన్‌ XI మ్యాక్స్‌, ఐఫోన్‌ XIఆర్‌ పేరిట యాపిల్‌ నూతన ఐఫోన్లు విడుదలవుతాయని తెలిసింది..!

1331
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles