ఐఫోన్ యూజర్లకు ఐఓఎస్ 13 అప్‌డేట్.. నేటి రాత్రి నుంచే అందుబాటులోకి..!


Thu,September 19, 2019 01:12 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 11, 11ప్రొ, 11 ప్రొ మ్యాక్స్ పేరిట తన నూతన ఐఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లలో వినియోగదారులకు ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ లభ్యం కానుంది. ఇక ఇతర ఐఫోన్ యూజర్లు ఈ ఓఎస్‌ను నేటి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల తరువాత ఆపిల్ తన ఐఫోన్లకు ఐఓఎస్ 13 అప్‌డేట్‌ను విడుదల చేయనుంది.

కాగా ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌ను ఐఫోన్ ఎస్‌ఈ, 6ఎస్, 6ఎస్ ప్లస్, 7, 7 ప్లస్, 8, 8 ప్లస్, ఐఫోన్ X, XR, Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్ల యూజర్లు నేటి రాత్రి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఐపాడ్ టచ్ 7వ జనరేషన్ డివైస్‌లకు కూడా ఈ అప్‌డేట్ నేటి రాత్రి నుంచి లభిస్తుంది. ఇక ఐప్యాడ్లకు ఈ నెల 30వ తేదీన ఆపిల్ నూతనంగా డెవలప్ చేసిన ఐప్యాడ్ ఓఎస్‌ను అందివ్వనుంది.

987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles