ఐఫోన్ Xఆర్ ఫోన్ల ఉత్పత్తి నిలిపివేత..!


Tue,November 6, 2018 04:21 PM

యాపిల్ రెండు నెలల కిందట తన నూతన ఐఫోన్లు ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్, Xఆర్ లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ముందుగా ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ లు మార్కెట్‌లో వినియోగదారులకు లభ్యం కాగా, తరువాత ఐఫోన్ Xఆర్ ఫోన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్లకు ఉన్నంత ఆదరణ ఐఫోన్ Xఆర్ ఫోన్‌కు లేదని తెలిసింది. దీంతో ప్రస్తుతం యాపిల్ ఈ ఫోన్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలిసింది. ఈ మేరకు యాపిల్ ఐఫోన్ల అసెంబ్లర్స్ ఫాక్స్‌కాన్, పెగాట్రాన్‌లకు సమాచారం ఇచ్చింది.

ఐఫోన్ Xఆర్ ఫోన్‌కు అనుకున్నంత డిమాండ్ లేనందున ఆ ఫోన్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశామని మరోవైపు ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ సంస్థలు కూడా వెల్లడిస్తున్నాయి. అయితే గత ఏడాది విడుదలైన ఐఫోన్ 8, 8 ప్లస్ ఫోన్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగిందని, అందుకే వాటి ఉత్పత్తికి తమకు ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని ఆ రెండు సంస్థలు వెల్లడిస్తున్నాయి. అయితే రానున్న క్రిస్మస్ సీజన్‌లో నూతన ఐఫోన్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా యాపిల్ భావిస్తున్నది. అందుకే ఐఫోన్ Xఆర్ తప్ప మిగిలిన రెండు నూతన ఐఫోన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిసింది.

2227
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles