పాత ఐఫోన్ల ధరలను భారీగా తగ్గించిన ఆపిల్..!


Wed,September 11, 2019 02:57 PM

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ నిన్న జరిగిన ఈవెంట్‌లో నూతన ఐఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా కొత్త ఐఫోన్ల విడుదల నేపథ్యంలో ఆపిల్ పాత ఐఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. ఈ క్రమంలో తగ్గింపు ధరలకే ప్రస్తుతం ఆ ఫోన్లు వినియోగదారులకు లభిస్తున్నాయి. మరి ఏయే ఫోన్లపై ఎంతెంత ధర తగ్గిందో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఐఫోన్ Xఆర్ 64జీబీ - పాత ధర రూ.76,900 - కొత్త ధర రూ.49,900 - తగ్గింపు రూ.27వేలు
ఐఫోన్ Xఆర్ 128జీబీ - పాత ధర రూ.81,900 - కొత్త ధర రూ.54,900 - తగ్గింపు రూ.27వేలు

ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ - పాత ధర రూ.69,900 - కొత్త ధర రూ.49,900 - తగ్గింపు రూ.20వేలు
ఐఫోన్ 8 64జీబీ - పాత ధర రూ.59,900 - కొత్త ధర రూ.39,900 - తగ్గింపు రూ.20వేలు

ఐఫోన్ 7 32జీబీ - పాత ధర రూ.39,900 - కొత్త ధర రూ.29,900 - తగ్గింపు రూ.10వేలు
ఐఫోన్ 7 128జీబీ - పాత ధర రూ.49,900 - కొత్త ధర రూ.34,900 - తగ్గింపు రూ.15వేలు

ఐఫోన్ 7 ప్లస్ 32జీబీ - పాత ధర రూ.49,900 - కొత్త ధర రూ.37,900 - తగ్గింపు రూ.12వేలు
ఐఫోన్ 7 ప్లస్ 128జీబీ - పాత ధర రూ.59,900 - కొత్త ధర రూ.42,900 - తగ్గింపు రూ.17వేలు

కాగా ఆపిల్ వాచ్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసిన సందర్భంగా ఆపిల్ వాచ్ సిరీస్ 3 వాచ్‌ల ధరలను తగ్గించింది. ఈ క్రమంలో వాచ్ సిరీస్ 3 జీపీఎస్ వాచ్ పాత ధర రూ.28,900 ఉండగా రూ.8వేల తగ్గింపుతో రూ.20,900 ధరకు లభిస్తున్నది. అలాగే ఆపిల్ వాచ్ సిరీస్ 3 జీపీఎస్ + సెల్యులార్ వేరియెంట్ పాత ధర రూ.37,900 ఉండగా రూ.8వేల తగ్గింపుతో రూ.29,900 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది.

6072
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles