జూన్ 3న యాపిల్ వార్షిక డెవ‌ల‌ప‌ర్ స‌ద‌స్సు.. ఐఓఎస్ 13 వివ‌రాల‌ను వెల్ల‌డించే అవ‌కాశం..?


Thu,March 21, 2019 12:58 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న వార్షిక డెవ‌ల‌ప‌ర్ స‌ద‌స్సు (WWDC) ని ఈ ఏడాది జూన్ 3వ తేదీన నిర్వ‌హించ‌నుంది. జూన్ 7వ తేదీ వ‌ర‌కు ఈ స‌ద‌స్సు కొన‌సాగుతుంద‌ని యాపిల్ తాజాగా ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అందులో భాగంగా ఐఓఎస్ 13, మాక్ ఓఎస్ 10.1.5, వాచ్ ఓఎస్ 6, టీవీ ఓఎస్ 13 ల గురించి యాపిల్ వివ‌రాలు వెల్ల‌డిస్తుంద‌ని తెలిసింది. అలాగే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న యాపిల్ డెల‌వ‌ప‌ర్లు అభివృద్ధి చేసిన ప‌లు నూత‌న సాఫ్ట్‌వేర్ ప్రొడ‌క్ట్స్‌ను కూడా స‌ద‌స్సులో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ స‌ద‌స్సు ఎంట్రీ ఫీజును 1599 డాల‌ర్లుగా నిర్ణ‌యించారు. అందుకు గాను యాపిల్ ఇప్ప‌టికే టిక్కెట్ల‌ను కూడా విక్ర‌యిస్తున్న‌ది. కాగా జూన్ 3వ తేదీన భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 10.30 గంట‌ల‌కు యాపిల్ డెవ‌ల‌ప‌ర్ స‌ద‌స్సు ప్రారంభం కానుంది.

534

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles