ఐఫోన్ X, 13 ఇంచ్ మాక్‌బుక్ ప్రొలను ఉచితంగా రిపేర్ చేయ‌నున్న యాపిల్


Mon,November 12, 2018 12:28 PM

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ తన ఐఫోన్ X, 13 ఇంచ్ మాక్‌బుక్ ప్రొలకు ఉచిత సర్వీసింగ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఐఫోన్ X ఫోన్లలో డిస్‌ప్లే సమస్యలు వస్తుండడంతో ఆ విషయంపై యూజర్లు యాపిల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫోన్ డిస్‌ప్లేలు కొన్నిసార్లు టచ్ చేసినప్పుడు అస్సలు స్పందించడం లేదని అంటున్నారు. అలాగే 13 ఇంచుల మాక్‌బుక్ ప్రొలలో హార్డ్ డ్రైవ్‌లలో డేటా లాస్ సమస్యలు వస్తున్నట్లు కూడా పలువురు యూజర్లు యాపిల్‌కు కంప్లెయింట్స్ ఇచ్చారు. దీంతో స్పందించిన యాపిల్ సమస్యలు ఉన్న ఐఫోన్ X ఫోన్లకు ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ చేస్తామని చెప్పింది. అలాగే సమస్యలు ఉన్న 13 ఇంచుల మాక్‌బుక్ ప్రొలను ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని కూడా యాపిల్ వెల్లడించింది. కాగా గతంలోనూ ఐఫోన్ 6కు ఇలాంటి సమస్యలే ఎదురవగా అప్పుడు కూడా యాపిల్ ఇలాగే స్పందించింది.

868

More News

VIRAL NEWS

Featured Articles