ట్రిపుల్ బ్యాక్ కెమెరాల‌తో రానున్న కొత్త ఐఫోన్లు..?


Sun,January 6, 2019 07:08 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న నూత‌న ఐఫోన్ల‌లో ట్రిపుల్ బ్యాక్ కెమెరాల‌ను అందివ్వ‌నున్న‌ట్లు తెలిసింది. ఈ క్ర‌మంలోనే కొత్త ఐఫోన్ మోడ‌ల్‌కు చెందిన ఇమేజ్‌లు ప్ర‌స్తుతం నెట్‌లో లీక‌య్యాయి. ఇప్ప‌టికే త‌న ఫోన్ల‌లో డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరా సెట‌ప్‌ను అందిస్తున్న యాపిల్ ఇక‌పై రానున్న ఐఫోన్ల‌లో ట్రిపుల్ బ్యాక్ కెమెరాల‌ను అందివ్వ‌నున్న‌ట్లు సమాచారం. ఇక ఆ ఫోన్ల‌లో కొత్త చేర‌నున్న మూడో కెమెరా 3డీ ఇమేజ్‌ల‌కు స‌పోర్ట్‌నిస్తుంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ప‌లు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ త‌యారీ కంపెనీలు 3డీ ఆప్ష‌న్‌ను కెమెరాల‌కు ఇస్తున్నాయి. అదే కోవ‌లో యాపిల్ చేర‌నున్న‌ట్లు తెలిసింది. అలాగే కొత్త ఐఫోన్ల‌ను కేవ‌లం 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ లో మాత్ర‌మే అందివ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా ఈ విష‌యాల‌పై స్ప‌ష్ట‌త రావాలంటే మ‌రికొంత కాలం వేచి చూడాల్సిందే..!

3549
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles