సెప్టెంబర్ 12న నూతన ఐఫోన్లు విడుదల..?


Sun,August 26, 2018 03:18 PM

సెప్టెంబర్ నెల వస్తుందంటే చాలు.. ఐఫోన్ ప్రియులందరూ నూతన యాపిల్ ప్రొడక్ట్స్‌తోపాటు నూతన ఐఫోన్ మోడల్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా యాపిల్ పలు నూతన ఐఫోన్ మోడల్స్‌ను విడుదల చేయనుందని తెలుస్తుండగా, వచ్చే నెల 12వ తేదీనే ఆ ఫోన్ల విడుదల కార్యక్రమం ఉంటుందని సమాచారం.

2018 ఐఫోన్ మోడల్స్‌లో 6.1 ఇంచుల డిస్‌ప్లేతో తక్కువ ధర కలిగిన ఓ ఐఫోన్ ఉంటుందని తెలిసింది. ఇక సెప్టెంబర్ 12వ తేదీన నూతన ఐఫోన్లను విడుదల చేస్తే తరువాత రెండు రోజులకు.. అంటే.. సెప్టెంబర్ 14 నుంచే నూతన ఐఫోన్లకు గాను ప్రీ ఆర్డర్లను ప్రారంభించే అవకాశం ఉందని తెలిసింది. అలాగే ఆ ఐఫోన్లను సెప్టెంబర్ 21వ తేదీ నుంచి విక్రయించవచ్చని సమాచారం. ఇక ఎప్పటి నుంచో ఐఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న డ్యుయల్ సిమ్ ఫీచర్‌తో ఓ ఐఫోన్‌ను యాపిల్ ఈ సారి విడుదల చేయవచ్చని తెలిసింది. మరి యాపిల్ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేస్తుందా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

3881

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles