HomeLATEST NEWSapple loses its popularity over its new iphones

యాపిల్ నూతన ఐఫోన్లకు తగ్గుతున్న ఆదరణ..?

Published: Tue,November 20, 2018 02:05 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ Xఆర్‌కు గాను ప్రొడక్షన్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోన్‌కు వినియోగదారుల నుంచి అంతంత మాత్రమే స్పందన లభిస్తుండడంతో ఆ ఫోన్ల తయారీని యాపిల్ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఈ ఫోన్ మాత్రమే కాకుండా, ఐఫోన్ Xఎస్, ఐఫోన్ Xఎస్ మ్యాక్స్‌ల ఉత్పత్తిని కూడా యాపిల్ నిలిపివేసిందని తెలిసింది. ఓ మీడియా సంస్థ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. యాపిల్ కొత్త ఐఫోన్లు మూడింటికీ అంతగా ఆదరణ లభించడం లేదట. ఈ ఫోన్లకు అనుకున్న దాని కంటే చాలా తక్కువగా డిమాండ్ ఉందట. దీంతో ఈ కొత్త ఐఫోన్ల విక్రయాలు కూడా బాగా తగ్గాయని, ఇది ఫోన్ల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందునే ఈ ఫోన్ల ఉత్పత్తిని యాపిల్ తాత్కాలికంగా నిలిపివేసిందని వార్తలు వస్తున్నాయి. అయితే కొత్త ఐఫోన్ల విక్రయాలు అనుకున్న స్థాయిలో జరగకపోయినప్పటికీ యాపిల్ మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.

2069
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology