వచ్చేస్తున్నాయ్.. నూతన ఐఫోన్లు..!


Sun,September 2, 2018 11:30 AM

ప్ర‌తి ఏటా సెప్టెంబ‌ర్ నెల వ‌స్తుందంటే చాలు.. ఐఫోన్ ప్రియులు నూత‌న ఐఫోన్ల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. కొత్త‌గా విడుద‌ల‌య్యే ఐఫోన్ల‌ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా నూత‌న ఐఫోన్లు త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి. ఈ నెల 12వ తేదీన యాపిల్ పార్క్ క్యాంపస్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో గ్యాదర్ రౌండ్ పేరిట యాపిల్ ఓ ఈవెంట్‌ను నిర్వహించనుంది. అందులో నూతన ఐఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లతోపాటు యాపిల్ ఐఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను లాంచ్ చేయనున్నారు.

గ్యాదర్ రౌండ్ ఈవెంట్‌లో యాపిల్ మూడు నూతన ఐఫోన్లను విడుదల చేసే అవకాశం ఉండగా అవి వరుసగా 6.5 ఇంచ్ ఓలెడ్ ఐఫోన్ X ప్లస్, 5.8 ఇంచ్ ఓలెడ్ ఐఫోన్ X ప్లస్, 6.1 ఇంచ్ మోడల్ ఐఫోన్లు అయి ఉంటాయని సమాచారం. ఈ ఫోన్లను గతంలో వచ్చిన ఐఫోన్ X మాదిరిగా డిజైన్ చేసినట్లు తెలుస్తున్నది. ఇక ఈ ఫోన్లలో యాపిల్ ఎ12 ప్రాసెసర్‌ను అమర్చినట్లు సమాచారం.

యాపిల్ తన కొత్త ఐఫోన్లకు గాను 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిసింది. ఇక 6.5 ఇంచ్ ఓలెడ్ ఐఫోన్, 6.1 ఇంచ్ ఎల్‌సీడీ ఐఫోన్లలో డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. ఇక నూతన ఐఫోన్లకు గాను ఎంట్రీ మోడల్ ధర 699 డాలర్లుగా ఉంటుందని, టాప్ ఎండ్ మోడల్ ధర 999 డాలర్లుగా ఉంటుందని సమాచారం. అదేవిధంగా గ్యాదర్ రౌండ్ ఈవెంట్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 4 స్మార్ట్‌వాచ్‌లను, ఐఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను, నూతన ఐప్యాడ్లను, మాక్‌బుక్‌లను కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది.

7342

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles