నూత‌న ఐపాడ్ ట‌చ్ డివైస్‌ను విడుద‌ల చేసిన యాపిల్


Wed,May 29, 2019 11:54 AM

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ జూలై 2015లో చివ‌రిసారిగా ఐపాడ్ ట‌చ్ 6వ జ‌న‌రేష‌న్ డివైస్‌ను విడుద‌ల చేయ‌గా, అప్ప‌టి నుంచి ఆ లైన‌ప్‌లో మ‌రొక ఐపాడ్ ట‌చ్ డివైస్ రాలేదు. కానీ ఇవాళ ఐపాడ్ ట‌చ్ 7వ జ‌న‌రేష‌న్ డివైస్‌ను ఎట్ట‌కేల‌కు యాపిల్ విడుద‌ల చేసింది. ఇక ఈ డివైస్‌లో ఎ10 ఫ్యుష‌న్ చిప్ సెట్‌ను అమ‌ర్చారు. ఐఫోన్ 7 లో ఈ చిప్‌సెట్ ఉండ‌గా దాన్ని ఇప్ప‌డు నూత‌న ఐపాడ్ ట‌చ్ డివైస్‌లో ఏర్పాటు చేశారు. ఇక ఈ ఐపాడ్ ట‌చ్ 32, 128, 256 జీబీ వేరియెంట్ల‌లో విడుద‌లైంది. 32జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.18,900 ఉండ‌గా, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.28,900 గా, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.38,900 గా ఉంది. అయితే ప్ర‌స్తుతానికి ఈ ఐపాడ్ ట‌చ్ ప‌లు ఎంపిక చేసిన దేశాల్లోని యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. త్వ‌ర‌లో భార‌త్‌లోనూ ఈ డివైస్ ల‌భ్యం కానుంది.

1446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles