కొత్త మాక్‌బుక్ ప్రొ లను విడుదల చేసిన యాపిల్


Sat,July 14, 2018 09:05 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ నూతన మాక్‌బుక్ ప్రొ లను తాజాగా విడుదల చేసింది. 13, 15 ఇంచుల వేరియెంట్లలో ఈ మాక్‌బుక్ ప్రొ లు విడుదలయ్యాయి. వీటిల్లో అధునాతన ఇంటెల్ 8వ జనరేషన్ కోర్ ప్రాసెసర్లను ఏర్పాటు చేశారు. గతంలో వచ్చిన మాక్‌బుక్ ప్రొ ల కన్నా ఈ మోడల్స్ 70 శాతం వేగవంతమైన ప్రదర్శనను ఇస్తాయి.

15 ఇంచుల మాక్‌బుక్ ప్రొ (2018) మోడల్‌లో ఇంటెల్ కోర్ ఐ7/ఐ9 ప్రాసెసర్, 32 జీబీ వరకు ర్యామ్ సపోర్ట్, 4జీ గ్రాఫిక్స్ మెమొరీ, 4టీబీ ఎస్‌ఎస్‌డీ, టచ్ బార్, టచ్ ఐడీ తదితర ఫీచర్లు ఉండగా ఈ మోడల్ ప్రారంభ ధర రూ.1,99,900 గా ఉంది. ఇక 13 ఇంచుల మాక్ బుక్ ప్రొ (2018) మోడల్‌లో ఇంటెల్ క్వాడ్‌కోర్ ఐ5/ఐ7 ప్రాసెసర్, 2 టీబీ ఎస్‌ఎస్‌డీ, టచ్ బార్, టచ్ ఐడీ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.1,49,900 గా ఉంది. ఇక ఈ రెండు మోడల్స్ ఈ నెల చివర్లో మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయి.

1881

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles