నూత‌న మ్యాక్‌బుక్ ప్రొ మోడ‌ల్స్‌ను విడుద‌ల చేసిన యాపిల్


Wed,May 22, 2019 01:07 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ 2019 మ్యాక్‌బుక్ ప్రొ మోడ‌ల్స్‌ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. వీటిల్లో 8, 9వ జ‌న‌రేష‌న్ ఇంటెల్ కోర్ ప్రాసెస‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల గ‌తంలో వ‌చ్చిన మ్యాక్‌బుక్ ప్రొల క‌న్నా కొత్త మ్యాక్‌బుక్‌ప్రొలు 40 శాతం వేగంగా ప‌నిచేస్తాయి. ఈ క్ర‌మంలోనే 15 ఇంచుల మాక్‌బుక్ ప్రొలో 6, 8 కోర్లు ఉన్న ఇంటెల్ ప్రాసెస‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌గా, వీటిల్లో రెటీనా డిస్‌ప్లేల‌ను అమ‌ర్చారు. అలాగే ట‌చ్ ఐడీ, ట‌చ్ బార్‌, ఫోర్స్ ట‌చ్ ట్రాక్‌ప్యాడ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ నూత‌న మ్యాక్‌బుక్ ప్రొల‌లో అందిస్తున్నారు.

ఇక 13 ఇంచుల మ్యాక్‌బుక్ ప్రొలో ట‌చ్ బార్‌, క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్ త‌దిత‌ర ఫీచర్ల‌ను ఏర్పాటు చేశారు. కాగా 13 ఇంచుల మ్యాక్‌బుక్ ప్రొ ట‌చ్‌బార్‌తో రూ.1,59,900 ధ‌ర‌కు ల‌భ్యం కానుండగా, 15 ఇంచుల మ్యాక్‌బుక్ ప్రొ రూ.1,99,900 ధ‌ర‌కు వ‌చ్చే వారం నుంచి ల‌భ్యం కానుంది.

1056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles