హెచ్‌1 హెడ్‌ఫోన్ చిప్‌తో విడుద‌లైన యాపిల్ కొత్త ఎయిర్ పాడ్స్


Sat,March 23, 2019 05:13 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న ఎయిర్ పాడ్స్‌కు చెందిన నూత‌న వేరియెంట్‌ను తాజాగా భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఈ కొత్త ఎయిర్ పాడ్స్‌లో నూత‌నంగా యాపిల్ హెచ్‌1 హెడ్‌ఫోన్ చిప్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఐఫోన్ల‌కు వీటిని మ‌రింత వేగంగా క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. అలాగే క‌నెక్ష‌న్ కూడా స్థిరంగా ఉంటుంది. ఇక ఈ ఎయిర్ పాడ్స్ లో యాపిల్ డిజిటల్ అసిస్టెంట్ సిరి కి కూడా స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎయిర్ పాడ్స్ స‌హాయంతో సుల‌భంగా కాల్స్ చేసుకునేందుకు, మ్యూజిక్ వినేందుకు వీలు క‌లుగుతుంది. ఈ ఎయిర్ పాడ్స్‌ను ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 5 గంట‌ల వ‌ర‌కు నాన్‌స్టాప్‌గా ఉప‌యోగించుకోవ‌చ్చు. కేవ‌లం 15 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే 3 గంట‌ల వ‌ర‌కు ఇవి ప‌నిచేస్తాయి. ఇక ఈ ఎయిర్ పాడ్స్ రూ.14,900 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో ల‌భ్యం కానున్నాయి.

1624
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles