యాపిల్ కార్డ్‌..! నూత‌న క్రెడిట్ కార్డును లాంచ్ చేసిన యాపిల్‌..!


Tue,March 26, 2019 02:43 PM

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్.. నూత‌నంగా యాపిల్ కార్డ్ పేరిట ఓ క్రెడిట్ కార్డును నిన్న లాంచ్ చేసింది. నిన్న జ‌రిగిన యాపిల్ స్పెష‌ల్ ఈవెంట్‌లో యాపిల్ కార్డును లాంచ్ చేశారు. యాపిల్ కార్డ్ అన్ని క్రెడిట్ కార్డుల్లా ప‌నిచేయ‌దు. దానికి ఫిజిక‌ల్‌గా కార్డు ఏమీ ఉండ‌దు. యూజ‌ర్ల‌కు చెందిన ఐఫోన్లే యాపిల్ కార్డులుగా ప‌నిచేస్తాయి. ఆ కార్డు స‌ర్వీస్‌ను యాక్టివేట్ చేసుకుంటే వెంట‌నే ఓ నంబ‌ర్ క్రియేట్ అవుతుంది. కానీ అది యూజ‌ర్ల‌కు క‌నిపించ‌దు. కాక‌పోతే ఆ నంబ‌ర్‌, ఇత‌ర స‌మాచారం అంతా యాపిల్ పే లో సెక్యూర్ గా స్టోర్ అవుతుంది. ఈ క్ర‌మంలో యూజ‌ర్లు యాపిల్ పే ఉన్న మ‌ర్చంట్ల దగ్గ‌ర యాపిల్ కార్డుతో బిల్లు చెల్లింపులు చేయ‌వ‌చ్చు. యాపిల్ పే లేని చోట కార్డును వాడుకునేందుకు వీలుగా ఫిజిక‌ల్ కార్డును కూడా యాపిల్ అందివ్వ‌నుంది.

యాపిల్ కార్డుకు ఎలాంటి ఫీజు లేద‌ని యాపిల్ వెల్ల‌డించింది. ఈ కార్డును వాడేవారికి రివార్డులు, క్యాష్‌బ్యాక్‌ను కూడా అందివ్వ‌నున్నారు. అలాగే ఈ కార్డు బిల్లు చెల్లింపులో ఎలాంటి ఆలస్యం అయినా అధిక రుసుం వ‌సూలు చేయ‌బోమని యాపిల్ వెల్ల‌డించింది. ఇక ఈ కార్డు ఈ వేస‌వి నుంచి మొద‌ట‌గా అమెరికా యాపిల్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రానుంది..!

2379

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles