ఐఫోన్లను ఉచితంగా రిపేర్ చేసి ఇవ్వనున్న యాపిల్..!


Mon,July 30, 2018 01:07 PM

యాపిల్ సంస్థ ఏంటి..? ఐఫోన్లను ఉచితంగా రిపేర్ చేసి ఇవ్వమేంటి..? ఇదేదో బంపర్ ఆఫర్ కాదు కదా..? అని అనుకుంటున్నారా..? అయితే వినండి. ఇది నిజంగా బంపర్ ఆఫరే. కాకపోతే భారత్‌లోని యాపిల్ వినియోగదారులకు కాదు. జపాన్‌లోని యాపిల్ యూజర్లకు..! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

ఇటీవలే పశ్చిమ జపాన్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి 224 మంది చనిపోయారు. వేల మంది ప్రజలు సొంత ప్రాంతాలను విడిచిపెట్టి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లారు. అయితే వర్షాల కారణంగా ఆ ప్రాంతాల్లోని యాపిల్ వినియోగదారులకు చెందిన ఐఫోన్లు, మాక్‌బుక్‌లు, ఐప్యాడ్లు, ఐపాడ్లు, యాపిల్ వాచ్‌లు పాడైనట్లయితే అలాంటి డివైస్‌లను ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని యాపిల్ వెల్లడించింది.

సాధారణంగా వాటర్ డ్యామేజ్‌కు యాపిల్ ఎలాంటి వారంటీని ఇవ్వదు. కానీ జపాన్‌లో వచ్చిన భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని, ఆ వర్షాల కారణంగా పైన చెప్పిన యాపిల్ డివైస్‌లు ఎవరివైనా పాడై ఉంటే వాటిని ఉచితంగా రిపేర్ చేసి ఇచ్చేందుకు యాపిల్ ముందుకొచ్చింది. ఇందుకు గాను కస్టమర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని యాపిల్ వెల్లడించింది. కేవలం వర్షాల వల్లే పాడైన యాపిల్ ఉత్పత్తులను మాత్రమే ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని యాపిల్ వెల్లడించింది.

2166

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles