యాపిల్ కొత్త ఐఫోన్ల బ్యాటరీ, ర్యామ్ స్పెసిఫికేషన్లు ఇవే..!


Thu,September 20, 2018 06:34 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన నూతన ఐఫోన్లు ఐఫోన్ X, ఐఫోన్ Xఎస్ మ్యాక్స్, ఐఫోన్ Xఆర్‌లను ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. ఈఫోన్లు త్వరలో వినియోగదారులకు లభ్యం కానున్నాయి. అయితే ఈ ఐఫోన్ల విడుదల సందర్భంగా యాపిల్ వీటి బ్యాటరీ, ర్యామ్ స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. కానీ ఓ సర్టిఫికేషన్ సైట్ నుంచి లీకైన సమాచారం మేరకు ఈ ఐఫోన్లలోని బ్యాటరీ, ర్యామ్ స్పెసిఫికేషన్ల వివరాలు బయటకు తెలిశాయి. అవేమిటంటే...

యాపిల్ ఐఫోన్ Xఎస్ లో 2658 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్ ఉండగా, ఐఫోన్ Xఎస్ మ్యాక్స్‌లో 3174 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్ ఉంది. ఇక ఐఫోన్ Xఆర్ ఫోన్‌లో 2942 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 3 జీబీ ర్యామ్ ఉన్నట్లు తెలిసింది. కాగా యాపిల్ పాత ఐఫోన్ల కన్నా ఈ కొత్త ఐఫోన్లు మరింత ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయని ఆ సంస్థ తన ఈవెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త ఐఫోన్లకు చెందిన బ్యాటరీ, ర్యామ్ స్పెసిఫికేషన్ల విషయంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

3538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles